ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడం ఇప్పుడు వివాదంగా మారింది. విజయనగరంలో కవులు మరియు కళాకారులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా విజయనగరంలోని గురజాడ సాహిత్య సాంస్కృతిక సామర్థ్యం గురజాడ పురస్కారాన్ని అందిస్తుంది.
ఇప్పటివరకు ఎందరో కళాకారులకు మరియు కవులకు ఈ పురస్కారం అందించారు. కానీ ఎప్పుడూ కూడా గురజాడ పురస్కారం వివాదం కాలేదు. అయితే ఈసారి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పుష్కరాలు ఇవ్వడం పట్ల జన విజ్ఞాన వేదిక కవులు మరియు కళాకారులు తప్పుపడుతున్నారు. ఆధ్యాత్మికవేత్త ఆయన చాగంటికీ అభ్యుదయ వాది అయిన గురజాడ పురస్కారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అటు . ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు పురస్కారం ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు సాహితీవేత్తలు. గురజాడ గౌరవయాత్ర పేరుతో కవులు, కళాకారుల ర్యాలీ చేస్తున్నారు. గురజాడ ఇంటి నుంచి ర్యాలీ చేస్తున్నారు కవులు, కళాకారులు.