తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నది నీటి విషయంలో కొన్ని రోజులుగా నీటి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాం నేషనల్ గ్రీణ్ టిబ్యునల్ దాకా వెళ్ళింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి నివేదిక పంపాలని కృష్ణాబోర్డుకు ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక బృందం రాయలసీమ ఎత్తిపోతల పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ఐతే ఇప్పటికే అనేక కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. తాజాగా మరో మారు ఈ పర్యటనకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
ఈ విషయమై ప్రస్తుత పరిస్థితి గురించి కేంద్రానికి లేఖ రాసారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు జులై 12వ తేదీలోపు నివేదిక ఇవ్వాలంటే జులై 3లోపు సందర్శన పూర్తి కావాలని, అలా కావాలంటే, సీఐఎస్ఎఫ్ బలగాలు కావాలని విజ్ఞప్తి చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోడల్ అధికారిని కేటాయించకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపింది.