ఇండస్ట్రీలో మొదటిసారి ఆ ఘనత అందుకున్న కృష్ణంరాజు..!

-

రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన సినీ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయవేత్తగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక లోకసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా రాజకీయ రంగంలో చక్రం తిప్పిన కృష్ణంరాజు అనుకోకుండా ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత రాజకీయాల వైపు అడుగుపెట్టలేదు. సినీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన కృష్ణంరాజు కేవలం తన కొడుకు ప్రభాస్ నటించిన సినిమాలలో మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక చివరిసారిగా ఆయన పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ లో నటించడం జరిగింది.

ఇదిలా ఉండగా.. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కృష్ణంరాజు.. నిన్న ఉదయం 3:25 గంటల సమయంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా తరలిరావడం జరిగింది . ఇక ఈరోజు ఆయన పార్తివదేహానికి కనక మేడ మామిడి తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.. ఇకపోతే ఎవరు సాధించని మొదటి ఘనత కృష్ణంరాజు సాధించారని చెప్పవచ్చు. అదేమిటంటే నటన రంగంలో మొదటిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్న నటుడిగా రికార్డ్ సృష్టించారు కృష్ణంరాజు.

నిజానికి 1964 నుంచి మొదటిసారిగా నంది అవార్డులను ప్రవేశ పెట్టడం జరిగింది. ఆ ఏడాది అక్కినేని నటించిన డాక్టర్ చక్రవర్తి చిత్రానికి మొదటిసారిగా ఉత్తమ చిత్రం కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ పురస్కారమైన నంది అవార్డు దక్కింది. ఇక అక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రధానం చేయడం ఆనవాయితీగా మారింది. ఇక 1977 నుంచి ఈ నంది పురస్కారాలను ఉత్తమ నటులకు ఇవ్వడం ప్రారంభించారు. ఇక ఆ ఏడాది మొదటిసారిగా ఉత్తమ నటుడు కేటగిరీ లో నంది అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా కృష్ణంరాజు చరిత్రలో నిలిచిపోయారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన అపర దీపం చిత్రంలో ఆయన అద్భుత నటనకు నంది అవార్డు వరించింది.

Read more RELATED
Recommended to you

Latest news