టాలీవుడ్‌లో ఫుల్‌ బిజీ అవుతోన్న కృతి శెట్టి

Join Our Community
follow manalokam on social media

కృతిశెట్టి టాలీవుడ్‌లో హాట్‌కేక్‌లా మారిపోతోంది. బేబమ్మతో రొమాన్స్‌ చెయ్యడానికి తెలుగు స్టార్లు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న కృతికి, ఇప్పుడు ఒక భారీ సినిమాలో అవకాశమొచ్చింది. ఈ మూవీతో కృతి కెరీర్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది.

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌ మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది కృతి శెట్టి. యూత్‌ ఆడియన్స్‌ అయితే కృతి పెర్ఫామెన్స్‌కి ఫుల్లుగా ఫిదా అయ్యారు. ఈ ఫాలోయింగ్‌ చూసే కృతి శెట్టి దగ్గరికి భారీ ఆఫర్స్‌ వస్తున్నాయి. రామ్- లింగుసామి కాంబినేషన్‌లో వస్తోన్న బైలింగ్వల్‌ మూవీలో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందట కృతి. ఇక ఈ సినిమాతో కృతి శెట్టి కోలీవుడ్‌కి కూడా వెళ్తోంది.

కృతి శెట్టి ‘ఉప్పెన’ రిలీజ్‌కి ముందే రెండు సినిమాలకి సైన్ చేసింది. నాని ‘శ్యామ్ సింగారాయ్’లో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది కృతి. అలాగే ఇంద్రగంటి మోహనక్రిష్ణ, సుధీర్‌ బాబు సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది బేబమ్మ.

కృతి శెట్టికి వస్తోన్న వరుస ఆఫర్స్‌ చూస్తే ఈమె త్వరలోనే స్టార్ హీరోయిన్ అయ్యేలా ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ లాంటి హీరోలు కూడా కృతి శెట్టి కాల్షీట్స్ దొరకడం అంత ఈజీ కాదని స్టేట్మెంట్స్‌ ఇచ్చారు. మరి డెబ్యూ మూవీలో చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌ ప్లే చేసిన కృతి శెట్టి ఈ సినిమాల్లో రెగ్యులర్‌ కమర్షియల్‌ రోల్స్‌ ప్లే చేస్తుందా, బరువైన పాత్రలు పోషిస్తుందా అన్నది చూడాలి.

 

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...