పోలవరంలో మరో చారిత్రాత్మక ఘట్టం రికార్డులకి ఎక్కింది. పోలవరం ప్రాజెక్టు లో స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు పూర్తి చేశారు. కేవలం 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. దీంతో స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణం లో కీలకమైన మొత్తం 192 గడ్డర్ల అమరిక పూర్తి చేసిన ఘనత మేఘా సంస్థకు దక్కింది. స్పిల్ వే పై గడ్డర్లు ఏర్పాటు పూర్తి కావడం తో షట్టరింగ్ పనులు చేసి స్లాబ్ నిర్మాణం పై దృష్టి పెట్టారు నిపుణులు. ఇక 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తున వున్న 192 గడ్డర్లను అతి తక్కువకాలంలోనే ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేశారు.
ఒక్కో గడ్డర్ తయారీకి 10టన్నుల స్టీల్,25క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడడం జరిగింది. ఒక్కో గడ్డర్ బరువు 62టన్నులు కాగా మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్ లు వాడారు. ఇక జూలై-6-2020న గడ్డర్లను స్పిల్ వే పిల్లర్లపై పెట్టడం ప్రారంచించి అతితక్కువ కాలంలోనే పనులు పూర్తి చేశారు. వరదలకు ముందే స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియను మెగా ఇంజనీరింగ్ సంస్ద చేపట్టింది. గోదావరికి భారీ వరదలు వచ్చినా పనులు ఆగకుండా స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు.