దేశమంతటా ప్రైవేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఎత్తేద్దాం.. బండి సంజయ్ కి సవాల్ విసిరిన కేటీఆర్

-

ఈనెల 27న హెచ్ఐసీసీలో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు.పనికిమాలిన, చేతగాని మాటలు చెప్పడం కాదని కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా దేశమంతా ఉచిత విద్యా, వైద్యం పెట్టు.మేం వద్దంటామా?అంటూ ఫైర్ అయ్యారు.”దేశమంతటా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఎత్తేద్దాం దమ్ముంటే మోడీని చట్టం చేయమను మేము కూడా మద్దతిస్తాం”.అంటూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్.

మీ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఉచిత విద్య, వైద్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు.డోల్ల మాటలు, సొల్లు పురాణం చెబితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, తగిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తెలంగాణలో బిజెపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.” గద్వాల్, వనపర్తి లో పాదయాత్ర చేస్తున్నావు కదా..పది కిలోమీటర్ల దూరంలో నీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలోని రాయచూర్, యాదగిరి, బీదర్ జిల్లాలకు వెళ్లి చూడు తెలంగాణ లాగా 24 గంటల కరెంట్, ఇంటింటికీ నీళ్లు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారా?సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా అన్న విషయం చూసి రా?అని సంజయ్ కు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news