నేను డ్ర‌గ్స్ టెస్టుల‌కు సిద్ధం.. రాహుల్ సిద్ధమా ?: కేటీఆర్ స‌వాల్

టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధమని.. రాహుల్ గాంధీ సిద్ధమా.. ? అని సవాల్ విసిరారు. వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు.. నోటికి వచ్చినట్టు వాగడం తప్ప ఎం లేదని.. మల్లారెడ్డి సవాలుకు భయపడి పారిపోయాడని చురకలు అంటించారు.

ktr

డ్రగ్స్ కు అంబాసిడర్ అని అంటారా..నాకు డ్రగ్స్ కు సంబంధం ఏంటి.. ? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ని పట్టుకొని తాగుబోతు అంటారా.. సున్నాలు వేసుకునే వాళ్లు.. కన్నాలు వేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇలాగే వ్యవహరిస్తే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు కేటీఆర్. రేవంత్‌ రెడ్డి మంత్రి కెటిఆర్ నిప్పులు చెరిగారు.

ప్రతిపక్షాలకు రాష్ట్రం లో పెద్ద పని లేదని… కేసీఆర్ అభివృద్ధి చూస్తూ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడని నిప్పపు చెరిగారు. రేవంత్ కొత్త బిచ్చగాడని… రేవంత్ దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదన్నారు. మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్పా అంత సీన్ లేదని… రూ. 50 కోట్లకు రేవంత్ పిసిసి చీఫ్ పదవి కొనుక్కున్నారు అని వారి పార్టీ నేతలే చెప్తున్నారని ఎద్దేవా చేశారు.