కాసేపటి క్రితం తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. కేటీఆర్ మాట్లాడుతూ దేశ జనాభాలో తెలంగాణకు
3 శాతం వాటా ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న అవార్డులలో దాదాపు 30 శాతం అవార్డులను తెలంగాణ ప్రభుత్వం అందుకుంటోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక తలసి ఆదాయంలో దేశంలోనే టాప్ ప్లేస్ లో తెలంగాణ ఉందని చెప్పారు. ఇక తెలంగాణ అభివృద్ధి మరియు సంక్షేమ పధకాల అమలు విషయంలో జెట్ వేగంతో దూసుకు వెళుతోందని సంతోషంగా చెప్పుకున్నారు కేటీఆర్. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మొత్తం మంది ప్రధానులు మారగా… వారంతా కలిపి రూ. 56 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశారు.
కానీ మన ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే రూ. 100 లక్షల కోట్లు అప్పులు చేశారు. నేను చెప్పిన దానిలో ఏదైనా అబద్దం ఉంటే రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతానని చెప్పారు.