హైదరాబాద్: తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 17న నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ. రెస్పాన్స్ షీట్లను టీఎస్ పీఎస్సీ విడుదల చేయడం జరిగింది. రేపటి నుండి జులై 1 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనుంది అని సమాచారం. ఆన్లైన్లో, ఆంగ్లంలో మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసినట్లు సమాచారం.
జులై 26 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్న రెస్పాన్స్ షీట్లు వెబ్‌సైట్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది టీఎస్‌పీఎస్సీ. తెలంగాణ హార్టికల్చర్ విభాగంలో 22 పోస్టులకు గాను ఈ నెల 17న పరీక్ష నిర్వహించగా.. 1,055 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్-1కు 1055 పేపర్-2కు 1,038 మంది అభ్యర్థులు హాజరయ్యారు.