తెలంగాణలో నలుగురు ఓమిక్రాన్ బాధితులకు సీరియస్..!?

ప్రపంచంలో ఓమిక్రాన్ వేరియంట్ అలజడి కలిగిస్తోంది. అతి వేగంగా ప్రపంచంలోని 97 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించింది. ఇండియాలో కూడా ఓమిక్రాన్ అలజడి మొదలైంది. ఇప్పటికే 170కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రపంచంలో ఓమిక్రాన్ మరణాలు కూడా మొదలయ్యాయి. యూకేలో 12మంది, అమెరికాలో ఒకరు ఓమిక్రాన్ తో మరణించారు.

తెలంగాణలో కూడా ఓమిక్రాన్ డెంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో 20 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారే. అయతే  ఇటీవల హైదరాబాద్ వచ్చిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా ఆఫ్రికా దేశాలకు చెందిన విదేశీయులే. మిగతా వారి పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఆఫ్రికా దేశాలకు చెందిన వారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వస్తుంటారు. ఇలా కెన్యా, సోమాలియా నుంచి నలుగురు క్యాన్సర్ పేషెంట్లు తెలంగాణకు వచ్చారు. వీరిలో ఓమిక్రాన్ బయటపడగా… వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యాన్సర్ వ్యాధి ఉండటంతో పాటు ఓమిక్రాన్ సోకడంతో ఆరోగ్యంపై ప్రభావం పడిందని.. వైద్యులు చెబుతున్నారు.