ఇంకా 14 నెలల ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వమే..ఓటు మాకే వేయండని మంత్రి కేటీఆర్ కోరారు. మునుగోడులోని సంస్థాన్ నారాయణ పూర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్… మాట్లాడారు. ఎమ్మెల్యే పైకి పోతే ఉపఎన్నిక వస్తుంది కానీ ఇక్కడ ఉపఎన్నిక మాత్రం అమ్ముడు పోతే వస్తుందని.. ఆయన అమ్ముడు పోయింది 18వేల కోట్ల కాంట్రాక్టు అని ఆరోపించారు.
కాంట్రాక్టర్ మదం తో ఈ ఉపఎన్నిక అని.. తులం బంగారం ఇచ్చి మిమ్మల్ని కొనాలని చూస్తున్నాడని రాజగోపాల్ పై ఫైర్ అయ్యారు కేటీఆర్. గ్యాస్ ధర భారీగా పెంచింది కేంద్రమని.. ప్రతిదీ రెట్లు పెరిగి సామాన్యుడి జీవితం దుర్బరం అయ్యిందన్నారు. ఇవన్నీ పెరగడానికి మోడీ కారణమని.. పైసలు పడేసి కొంటానని చూస్తోంది బీజేపీ అని ఆగ్రహించారు. ఫ్లోరోసిస్ సమస్య తో బాధ పడింది మునుగోడు అని.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇంటింటికి ఇచ్చారన్నారు. కానీ ఇన్నేళ్లలో మిగితా వాళ్ళు ఎందుకు చేయలేదు.. 24 గంటల కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తు చేశారు కేటీఆర్.