జగన్‌తో విబేధాలపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఏపీ సీఎం జగన్మోహన్​ రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపై మంత్రి కేటీఆర్​ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. ఏపీ సర్కారుతో చక్కటి సంబంధాలు ఉన్నాయని కేటీఆర్‌ వెల్లడించారు. ఎటువంటి పంచాయితీలు లేవని కేటీఆర్​ స్పష్టం చేశారు. రాష్ట్రాల విభజన తర్వాత ఉండే కొన్ని అంశాలు.. కేంద్రం తేల్చాల్సిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు కేటీఆర్‌. అంతే కానీ ఎటువంటి సమస్యలు లేవని కేటీఆర్‌ తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్​తనకు పెద్దన్న లాంటి వారని ఈ సందర్భంగా వెల్లడించారు కేటీఆర్‌. ముఖ్యమంత్రి కేసీఆర్​తో కూడా జగన్​కు చక్కని సంబంధాలు ఉన్నాయని, తమకు ఏనాడు కూడా పంచాయితీలు లేవన్నారు.

Family rift in TRS over elevation of KTR as working president | Mint

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. చంద్రబాబు తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆయనే ఏదో ఊహించుకున్నారని.. కానీ ఆయనతో ఎలాంటి తగాదా లేదన్నారు. తాము రాజకీయాల్లో ఎవరినీ శత్రువులుగా చూడమని, కేవలం వారిని ప్రత్యర్థులుగానే చూస్తామన్నారు కేటీఆర్‌. పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, అందిరతోనూ సత్సంబంధాలే కోరుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్​ అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు, జగన్​లతో సత్సంబంధాలే ఉన్నాయని కేటీఆర్​ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news