కేటీఆర్ మార్క్ ఆప‌రేష‌న్‌: గులాబీ గూటికి అజార్

-

తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్ త‌గ‌లున్న‌దా… ఇప్ప‌టికే కాంగ్రెస్ తెలంగాణ‌లో చిన్నాభిన్నం అవుతున్న త‌రుణంలో మ‌రోమారు కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరేందుకు మ‌రో కీల‌క నేత చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ, హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌, భార‌త క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్ధీన్ గులాబీలోకి జారుకోనున్నాడా.. అంటే అవున‌నే అంటున్నాయి గులాబీ శ్రేణులు, ప్ర‌స్తుత ప‌రిస్థితులు. అయితే అందుతున్న సమాచారం ప్ర‌కారం ఒక‌టి రెండు రోజుల్లో అజారుద్ధీన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి గులాబీ కండువా క‌ప్పుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

అజారుద్ధీన్ భార‌త క్రికెట్ కు ఎన‌లేసి సేవ‌లు చేశాడు. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా చిర‌స్మ‌ర‌ణీమైన విజ‌యాలు అందించాడు అజారుద్ధీన్. భార‌తీయ క్రికెట్‌కు దిశానిర్ధేశం చేసిన కెప్టెన్‌గా రాణించిన అజారుద్దీన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌రువాత కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. త‌రువాత కాంగ్రెస్‌లో క్రియాశీల‌క రాజ‌కీయాల్లో ప‌నిచేసిన అజారుద్ధీన్ త‌రువాత సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసీ ఓడిపోయారు.

త‌రువాత కొంత‌కాలం రాజ‌కీయంగా యాక్టివ్‌గానే ఉన్న అజారుద్ధీన్ ఒకానొక ద‌శ‌లో పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో నిలిచారు. క‌నీసం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడ‌ని అంద‌రు అనుకున్నారు. కానీ కాంగ్రెస్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతాయి. అందుకే అధ్య‌క్ష ప‌ద‌వి అజారుద్ధీన్‌కు అంద‌కుండా పోయింది. ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్ ఓడిపోయిన త‌రువాత రాజ‌కీయంగా సెలెంట్‌గా ఉంటున్న అజారుద్ధీన్ గ‌తంలో జ‌రిగిన హెచ్‌సీఏ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఉబ‌లాట‌ప‌డ్డాడు.

అయితే టీ ఆర్ ఎస్ నేత‌గా ఉన్న అప్ప‌టి అధ్య‌క్షుడ గ‌డ్డం వివేక్ వెంక‌ట‌స్వామి కి ప్ర‌భుత్వం అండ‌దండ‌గా ఉండ‌టంతో అజారుద్ధీన్‌పై ఉన్న కేసుల సాకు చూపి పోటీ చేయ‌కుండా నిలువ‌రించారు. దీంతో అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. అయితే హెచ్‌సీఏ అధ్య‌క్షుడి ఉన్న వివేక్ వెంక‌ట‌స్వామిపై కేసులు రావ‌డంతో ఆయ‌న ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు.. దీనికి తోడు టీ ఆర్ ఎస్ ప్ర‌భుత్వం కూడా అజారుద్ధీన్‌కు అండ‌దండ‌లు అందించ‌డంతోనే గెలుపు సాధ్య‌మైందనేది టాక్‌.

టీ ఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అజారుద్ధీన్ గెలుపు కోసం ఓ ప్ర‌త్యేక వ్యూహం ర‌చించార‌ట‌. దీంతో అజారుద్దీన్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌ల సాగింది. అందుకే త‌న చిర‌కాల కోరిక తీరిన నేప‌థ్యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన టీ ఆర్ ఎస్ లో చేరి కేసీఆర్‌కు అండ‌గా ఉండాల‌నే ఆలోచ‌న‌తో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి గులాబీ గూటికి చేర‌నున్నాడ‌నే టాక్‌తో కాంగ్రెస్‌లో గుబులు మొద‌లైంద‌నే చెప్ప‌వ‌చ్చు.. మైనార్టీ నేత‌గా, దేశ వ్యాప్తంగా ఉన్న‌మంచి నేత‌ల్లో ఒక‌రిగా ఉన్న అజారుద్ధీన్ కాంగ్రెస్‌ను వీడ‌టం ఆ పార్టీకి మైనార్టీల్లో మైన‌స్ అని చెప్ప‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news