రేప్ లు చేసే వారికి ఉద్యోగం, పథకాలు అందకూడదని మంత్రి KTR పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారి లిస్టు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇలాంటి కేసుల్లో ఒక్కసారి పేరు నమోదు అయితే వారికి ఉద్యోగం దొరకకూడదని, ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా చేయాలని వ్యాఖ్యానించారు. హోం మంత్రి, డిజిపి దీనిపై కసరత్తు చేయాలని, దీని కోసం ‘సెక్సువల్ అఫెండర్ రిజిస్టర్’ తీసుకురావాలని సూచించారు.