రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించారు. కొందరిలాగా ఈడీ దర్యాప్తు అనగానే దాక్కునే అలవాటు తమకు లేదని.. తమపై వచ్చిన ఆరోపణలను తొలగించుకునే సత్తా ఉందని అన్నారు. ఈడీ విచారణను ఎదుర్కొనే దమ్ము కవితకు ఉందని కేటీఆర్ అన్నారు.
“బీజేపీ నేతలపై పెట్టిన కేసులు ఈడీ, సీబీఐ, ఐటీ చూపెట్టగలవా? కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయి. మోదీ-అదానీ చీకటి స్నేహం గురించి అందరికీ తెలుసు. గుజరాత్‌లో మద్యం తాగి 22 మంది చనిపోయారు…అది లిక్కర్ స్కామ్. అదానీకి అనుగుణంగా కేంద్రం పాలసీ చేసింది…స్కామ్ అంటే అది. అదానీ పోర్ట్‌లో డ్రగ్స్ దొరికితే స్కామ్ కాదట? బీఎల్ సంతోష్‌ను విచారణకు పిలిస్తే దాక్కున్నారు. మా ఎమ్మెల్సీ కవిత చట్టాన్ని గౌరవిస్తారు…విచారణను ఎదుర్కొంటారు. విచారణను ఎదుర్కొనే దమ్ము మాకు ఉంది.” – కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి