బ్రిటీష్‌ వారిని భయపెట్టిన చపాతీ.. ఫ్రీడమ్‌ మూమెంట్‌లో రోటీలది గొప్ప పాత్రే..!

-

నార్త్‌ ఇండియన్స్‌ ఈరోజుకు రోటీలు, చపాతీలనే ఎక్కువ తింటారు. అక్కడ వాటికి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. అందుకే వాళ్లు ఎప్పుడు సన్నగా, ఫిట్‌గా ఉంటారు. చపాతీలకు స్వతంత్ర్య ఉద్యమంలో ప్రధాన్యత ఎక్కువే ఉంది. వీటిని చూసి బ్రిటీష్‌ దొరలకు భయం వేసిందంటే నమ్మగలరా..? ‘చపాతి మూమెంట్ 1857’ గా చరిత్రకు ఎక్కింది. సిపాయిల ఉద్యమానికి నాంది పలికింది చపాతీలే.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఆ స్టోరీ ఏంటంటే..
1857లో ఈ చపాతీ ఉద్యమం ఆగ్రా సమీపంలోని మధుర ప్రాంతంలో మొదలైంది. స్వాతంత్య్ర భారతం కోసం పోరాడుతున్న నిరసనకారులు సుదూర ప్రాంతాల్లో పోరాడుతున్న వారి కోసం చపాతీలు తయారుచేసి, పంపిణీ చేసేవాళ్లు.. ఈ చపాతీల పంపిణీ కేవలం రాత్రి పూట లేదా తెల్లవారుజామున మాత్రమే జరిగేద.. గ్రామ చౌకీదారులు, స్థానిక పోలీసులు కూడా ఈ పంపకాలలో భాగమయ్యారు. 90 వేల మందికి పైగా భారతీయ సైనికులు ఈ చపాతి పంపిణీలో చేరరంటే మాటలు కాదు… చపాతీలు ఇళ్లకు రాత్రిపూట మాత్రమే పంపిణీ చేసేవారు. ఈ చపాతీలను స్వీకరించిన ప్రజలు, మరిన్ని చపాతీలను తయారు చేసి వారి పొరుగు గ్రామాలకు చేరవేసేవాళ్లు.. ఇలా చపాతీల ఉద్యమమే సాగింది. దీంతో బ్రిటిష్ అధికారులకు డౌట్‌ వచ్చింది.. మధురలో మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న మార్క్ తార్న్ హిల్ ఈ చపాతీల పంపకంపై విచారణ చేశారు. ప్రతిరోజు రాత్రి 300 కిలోమీటర్లకు పైగా ఇవి రవాణా అవుతున్నాయని తెలిసి వాళ్లు ఆశ్చర్యపోయారు.
ఇంత పెద్ద సంఖ్యలో చపాతీలు అకస్మాత్తుగా ఎందుకు పంపిణీ అవుతున్నాయని ఆయనకు అనుమానం వచ్చింది . ఎంత విచారణ చేసినా అసలు కారణాలు తెలియలేదు. చపాతీల్లో ఏవో రహస్య సంకేతాలు ఉన్నాయని, సందేశాలు ఉన్నాయని, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వీటిని వాడుతున్నారని అనుమానించారు. చపాతీలను చింపి ముక్కలు చేసి చూసినా… వారికి అందులో ఏమీ దొరకలేదు. కొంతమంది మాత్రం ఈ చపాతీ ఉద్యమం అనేది ప్రజలను సమీకరించి, వారిని సంఘటితం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఒక మార్గం అని చెప్పుకుంటారు.
మే 10న మీరట్లో ప్రారంభమైన ‘1857 సిపాయిల తిరుగుబాటు’కు పునాది ఈ చపాతీ ఉద్యమమే అని చెప్పే వాళ్ళు. ఈ రోటీ ఉద్యమం గురించి ఫతేపూర్ కలెక్టర్‌గా అప్పట్లో పనిచేసిన జె డబ్ల్యూ షేరర్ తన ‘డైలీ లైఫ్ డ్యూరింగ్ ది ఇండియన్ మ్యుటీని’ అనే పుస్తకంలో రాశారు. ప్రజలను ఏకం చేయడంలో చపాతీలు అప్పుడు ప్రముఖ పాత్రే పోషించాయి.. అయినా ఒకప్పుడు ప్రజలకు ఉన్నంత ఐకమత్యం.. ఈరోజు ఎక్కడుంది.. ఒకవేళ ఈరోజుల్లో స్వాంతంత్ర్యం తెచ్చుకోవాలంటే.. ఎవరూ ముందుకురారేమో..! మనుషులు అలా ఉన్నారు ఏం చేస్తాం..!!

Read more RELATED
Recommended to you

Latest news