మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ లో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడిగుండుకు కుట్లు వేసినట్టు ఉంది ఈ గుంపు మేస్త్రీ పాలన తీరు అని విమర్శించారు.
హైదరాబాద్ లో మూసి బాధితులు ఉంటే-నల్గొండలో మూసి పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి? కూల్చిన ఇండ్లెక్కడ – కాలిన కడుపులెక్కడ -నువ్వు తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ ? ఆగిన గుండెలెక్కడ – రగిలిన మనసులెక్కడ .. నువ్వు చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ – నువ్వు చేస్తున్న పాదయాత్ర ఎక్కడ ? నీ కుట్రలకు అంబర్ పేట్ – అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే – నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ ? నీ మూసి దాహానికి అత్తాపూర్ ఆగమైంది -గోల్నాక గొల్లుమంటుంది-దిలుషుక్ నగర్ ఢీలా పడ్డది. అయ్యా సంబరాల రాం బాబు – నీ అన్యాయానికి..అవేధనలు,ఆవేశాలు,అక్రాందనాలు వినిపిస్తున్నవి కనిపిస్తున్నవి అక్కడ కాదు రా ఇటు వైపు రా ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర తేలు మంత్రం రానోడు .. పాము కాటుకు మంత్రం ఏసినట్లు .. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్ అంటూ ట్వీట్ చేశారు.