హైదరాబాద్ లోని దుర్గం చెరువు ప్రాంతాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు, ఈ చెరువుపై వంతెన నిర్మిస్తే రవాణా ఎంతో సులువుగా మారుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా బలమైన తీగెలతో వంతెన నిర్మిస్తున్నారు. అయితే నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెన లింక్ పనులకు సంబంధించిన తాజా ఫొటోలను రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు.

నిర్మాణ పనులు తుది దశకు చేరడంతో దుర్గం చెరువు, పరిసరాలు సరికొత్తగా కనువిందు చేస్తున్నాయి. కేటీఆర్ ట్వీట్‌ను పెద్ద ఎత్తున నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయంటూ ప్రశంసిస్తున్నారు. ఫొటోలలో దుర్గం చెరువును చూస్తుంటే విదేశాలను తలపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
Some more pics of the Durgam Cheruvu suspension bridge pic.twitter.com/mkfYvX7GiI
— KTR (@KTRTRS) November 17, 2019