వరద సాయం మీద విమర్శలు.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్

వరద సహాయం కంపెనీ మీద అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. మంత్రి హోదాలో కాకుండా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఇతర పార్టీలని విమర్శలతో చీల్చి చెండాడారు. హైదరాబాద్ లో భారీ వర్షాలకు వందల కాలనీలు నీటమునిగాయన్న ఆయన హైదరాబాద్ లో నాలాలలపై చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. నాలుగు లక్షల వరద బాధితుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చామన్న ఆయన ఎవరికి సాయం చేశామనే దాని మీద పూర్తి వివరాలు ఉన్నాయని అన్నారు.

ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఇచ్చామని, అయితే బాధితులకు వెంటనే ఇవ్వాలని ఇలా నగదు రూపంలో ఇస్తే దాన్నీ రాజకీయం చేస్తున్నారని అన్నారు. తాము వరద సాయం చేస్తుంటే కాంగ్రెస్ బీజేపీ బురద రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. తాము వరద సాయం పనిలో ఉంటే ఆ రెండు పార్టీలు మాత్రం దుబ్బాకలో ఓట్ల కోసం ప్రయత్నం చేశాయని అన్నారు. కేంద్రం గుజరాత్, కర్ణాటక కు సాయం చేసిందని, ప్రధాని కి లేఖ రాస్తే స్పందన లేదని అన్నారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదన్న అయన తెలంగాణ దేశంలో లేదా ? అని ప్రశ్నించారు. నలుగురు ఎంపీలు ఉన్నారు ? ఎందుకు అడగరు అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.