తల్లికి కూడా చెప్పలేని వాటిని డాక్టర్ కు చెబుతారని అంటారు..అది నిజం..అందుకే వైద్యొ నారాయణ హరి అంటారు.డాక్టర్ కనిపించే దేవుడు అని అంటారు. ప్రాణాలను పోసే శక్తి, హరించే శక్తి ఆ దేవుడి తరువాత వైద్యులకు మాత్రమే ఉంది.ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడితే.. ఆ వైద్యులను బాధిత వ్యక్తులు దేవుడికంటే ఎక్కువగా కొలుస్తారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఊపిరి ఆడకుండా పుట్టిన పసిపాపకు ఓ వైద్యురాలి తన ఊపిరి ఊది ప్రాణం పోసింది. ఆ చిన్నారి గొంతు నుంచి కేరింతలు వచ్చేలా చేసింది. ఓ గర్భిణీ ప్రసవం చేసి బిడ్డకు బయటకు తీశారు వైద్యులు. అయితే, ఆ చిన్నారి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇంతలో ఆ చిన్నారి ఉలుకుపలుకు లేకుండా మిన్నకుండిపోయింది. ఊపిరి కూడా తీసుకోవడంతో లేదు. దాంతో అలర్ట్ అయిన ఓ వైద్యురాలు.. వెంటనే చిన్నారిని సీపీఆర్ చేసింది.
పసిపాప నోటి ద్వారా గాలి ఊది ఊపిరి అందించారు. వెనక్కి తిప్ప వీపుపై కొడుతూ గుండె కొట్టుకునేలా చేశారు. చివరకు వైద్యురాలి ప్రయత్నాలు ఫలించాయి. చిన్నారి ఊపిరి తీసుకుంది. గుండె కొట్టుకుంది. కేరుమంటూ సందడి చేసింది. మొత్తానికి చిన్నారి ప్రాణాలు నిలవడంతో.. ప్రాణం పోసిన వైద్యురాలితో సహా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వైద్యురాలిని ప్రాణం పోసిన దేవతగా పోలుస్తూ కీర్తిస్తున్నారు.అందుకే కదా వీళ్లకు దండం పెడతారు..నిజంగా గ్రేట్ అని చెప్పాలి.
डॉक्टर सुलेखा चौधरी, पीडियाट्रीसियन, CHC, आगरा।
बच्ची का जन्म हुआ लेकिन शरीर में कोई हलचल नहीं थी।
बच्ची को पहले ऑक्सिजन सपोर्ट दिया, लेकिन जब उससे भी लाभ नहीं हुआ तो लगभग 7 मिनट तक ‘माउथ टू माउथ रेस्पिरेशन’ दिया, बच्ची में साँस आ गई।👏🏼❤️#Salute #Doctor #respect pic.twitter.com/1PQK8aiJXQ— SACHIN KAUSHIK (@upcopsachin) September 21, 2022