మోదీ, బీజేపీని ప్రశ్నిస్తే దేశ ద్రోహి ముద్ర వేస్తున్నారు..: కేటీఆర్

-

ఎనిమిదేళ్ల క్రితం నరేంద్ర మోదీ వచ్చినప్పుడు రూ. 410 ఉంటే ఈ రోజు రూ.1002 కి పెరిగింది. లక్ష కోట్ల సబ్సిడీని నరేంద్ర మోదీ ఎత్తేయడంతో గ్యాస్ సిలిండర్ల పెరిగాయని విమర్శించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో రేట్లు పెంచితే విమర్శించిన మోదీ.. ప్రస్తుతం రేట్లు పెంచతున్నారని విమర్శించారు. రేట్లు పెరుగుతున్నా… మోదీకి చీమ కుట్టిన్నంత బాధ కూడా లేదని కేటీఆర్. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే… దేశద్రోహి ముద్ర వేస్తున్నారని, దేశం కోసం ధర్మం కోసం మేం రేట్లు పెంచితే మమ్మల్నే ప్రశ్నిస్తారా..? అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం వల్ల పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగితే… ప్రతీ వ్యక్తి బాధ పడుతున్నారని కేటీఆర్ అన్నారు. ముడి చమురు ధరలకు, మోదీ చమురు ధరలకు ఏమైనా సంబంధం ఉందా…? అంటూ ప్రశ్నించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల పెట్రోల్, డిజిల్ రేట్లు పెంచుతున్నామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. యాసంగిలో పండించే వరి పంటను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. పియూష్ గోయల్ బాయిల్డ్ రైస్ డిమాండ్ లేదని… మీ ప్రజలకు నూకలు తినడం నేర్పించాలని వెటకారం చేస్తున్నాడు… ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news