భారత రాష్ట్ర సమితి పార్టీని బిజెపి పార్టీలో విలీనం చేస్తారని నిన్నటి నుంచి కొన్ని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీవీ అధినేత రవి ప్రకాష్.. దీనిపైన ప్రత్యేక ప్రోగ్రాం కూడా నడిపించాడు. అయితే ఈ వార్తలపై తాజాగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. బిజెపిలో గులాబీ పార్టీ విలీనం అనేది ప్రచారం మాత్రమేనని స్పందించారు కల్వకుంట్ల తారక రామారావు.
తప్పుడు ఎజెండాలతో నిరాధారమైన రూమర్స్ ను వ్యాప్తి చేసే వారికి… ఇదే మా చివరి హెచ్చరిక అంటూ ఫైర్ అయ్యారు. దీనిపైన వెంటనే రిజైన్డర్ను ప్రచురించండి లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీవోకి వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. గులాబీ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిత్యం పనిచేస్తుందని తెలిపారు. గులాబీ పార్టీ లేకపోతే తెలంగాణ లేదని.. తెలంగాణ ఉంటేనే గులాబీ పార్టీ కచ్చితంగా ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఇకపై ప్రచురించడం మానేస్తే బాగుంటుందని తెలిపారు.