ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి అనే విషయాలు చాలా కామన్ అయిపోయాయి. అలా ప్రేమించి ఒక వ్యక్తితో వెళ్ళిపోయినా యువతి మరణించాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజంపేట మండలం పొందుర్తి గ్రామానికి చెందిన అబ్జానా బేగం అనే 20 ఏళ్ళ చాకుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఓ అబ్బాయితో ప్రేమలో పడిన అబ్జానా అతనితో కొద్దిరోజుల పాటు ఇంటి నుంచి వెళ్లి పోయినట్టు చెబుతున్నారు. అయితే సదరు వ్యక్తికి పెళ్లి అయిన విషయం తెలుసుకుని అబ్జానా ఇంటికి తిరిగి వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేసాడని మనస్తాపం చెంది గొంతు కోసుకుని అబ్జానా ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్టు చెబుతున్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు.