అందరూ..పప్పు వేరేగా వండుకుంటారు. బెండకాయను వేరేగా వండుకుంటారు. అసలు ఈ రెండింటిని కలపాలనే థాట్ కూడా ఎవరకీ రాదు. బెండకాయతో ఫ్రై, పులుసే కాకుండా.. బెండకాయ దాల్ కూడా చేస్తే.. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది బ్రెయిన్ కూడా చాలా మంచి ఆహారమట. మరి బెండకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామా..!
బెండకాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
బెండకాయ ముక్కలు ఒక కప్పు
కందిపప్పు ఒక కప్పు
టమోటా పేస్ట్ ఒక కప్పు
మజ్జిగా అరకప్పు
పచ్చిమిర్చి నాలుగు
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టీ. స్పూన్
ఆవాలు ఒక టీ స్పూన్
మీగడ ఒక టీ స్పూన్
ఇంగువ ఆఫ్ టీ. స్పూన్
కరివేపాకు కొద్దిగా
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా
తయారు చేసే విధానం..
చిన్నసైజు కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు, పసుపు, టమోటా పేస్ట్ వేసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోండి. పొయ్యిమీద ఒక నాన్‌స్టిక్ పాత్ర పెట్టి అందులో మీగడ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువపొడి, పసుపు వేసి వేగనివ్వండి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అందులో వేయండి. మూతపెట్టి నాలుగు ఐదు నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత పుల్ల మజ్జిగా పోస్తే బెండకాయలో జిగురు, చప్పదనం పోతుంది. బెండకాయలు పేస్ట్‌లా అవ్వకూడదు. పుల్ల మజ్జిగ అంతా ఆవిరిఅయిపోతుంది. అప్పుడు టమోటా పేస్ట్‌లో ఉడికించిన కందిపప్పు వేసి తిప్పండి. నిమ్మరసం, కొత్తిమీర వేసి తీసేయండి.! అంతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పప్పు రెడీ.. ఉప్పు లేకపోయినా కమ్మగా ఉంటుంది. బెండకాయతో ఈ సారి ఇలా ట్రేచేసి పిల్లలకు పెట్టండి. ఎదిగే పిల్లలకు ఇలాంటి ఆహారాలు పెడితే.. వారి బ్రెయిన్‌కు చాలా హెల్ప్ అవుతుంది. ప్రొటీన్ రిచ్ కాబట్టి.. ఎవరైనా సరే హ్యాపీగా తినేయొచ్చు.
– Triveni Buskarowthu