ఎన్సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు రద్దు చేసిన లోక్‌సభ

-

లక్షద్వీప్ ఎంపీ ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్​పై అనర్హత వేటును లోక్​సభ రద్దు చేసింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్​సభ సెక్రెటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనర్హతను వెనక్కి తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

హత్యకేసులో మహ్మద్‌ ఫైజల్‌కు కింది కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపత్యంలోనే లోక్​సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దుచేసింది. మహమ్మద్‌ ఫైజల్‌ జైలుశిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టే విధించినా లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఫైజల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

మంగళవారం రోజున విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫైజల్​పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించక పోవడం వల్ల ఏ ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లిందని ప్రశ్నించింది. హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని అడిగింది. నియోజకవర్గ ప్రజలు తనను ఎన్నుకున్నారని, వారికి ప్రాతినిధ్యం వహించే హక్కును లాగేసుకున్నారని ఫైజల్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి.. సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టులో ఇదివరకే సంబంధిత కేసును విచారించారని, అందుకే ఇక్కడే వ్యాజ్యం దాఖలు చేసినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news