Lakshya Trailer : నాగ శౌర్య “లక్ష్య” ట్రైలర్ రిలీజ్.. దుమ్ము లేపేశాడుగా !

-

టాలీవుడ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా మూవీ లక్ష్య. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను…. ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పీ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ, హీరోయిన్‌ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా లో నాగశౌర్య క్రీడా కారుడి పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం.

లక్ష్య సినిమా ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ లో హీరో నాగ శౌర్య.. సిక్స్ ప్యాక్ తో కనిపించడమే కాకుండా డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. అటు కేతికశర్మ తన అందాలను ఆరబోసింది. ఇక జగపతి బాబు కూడా తనదైన యాక్టింగ్ తో ఇరగదీశాడు. మొత్తానికి ట్రైలర్ సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news