Lal salaam :లాల్‌సలామ్‌ లొకేషన్‌లో కపిల్ దేవ్

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం లాల్ సలాం.ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.

క్రికెట్‌, కమ్యూనిజం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో లెజెండరీ మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. తాజాగా లాల్‌ సలామ్ షూటింగ్ లొకేషన్‌ లో ఓ వైపు కపిల్ దేవ్‌.. మరోవైపు రజినీకాంత్‌.. ఇద్దరి మధ్య ఐశ్వర్య ఉన్న ఫొటోలు నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కపిల్‌ దేవ్‌ క్రికెట్‌ కోచ్‌గా కనిపించబోతున్నారు.ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news