బీమ్లా నాయక్‌ ”లాలా బీమ్లా” డీజే వర్షన్‌ రిలీజ్‌.. ఇక పవన్ ఫ్యాన్స్ కు జాతరే

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ అలరిస్తుండగా… రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ గా రానా కనిపించనున్నాడు.


అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలోని లాలా బీమ్లా డీజే వర్షన్‌ తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం.  ఇక ఈ డీజే వర్షన్‌ సాంగ్‌ లో పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్‌ సీన్స్‌ ను చూపించారు. అలాగే.. ఈ పాట లో పవన్‌ కళ్యాణ్‌ లుంగీలో కనిపించి.. అందరినీ ఆకట్టుకున్నాడు. అటు ఈ పాట వింటుంటే.. గూస్‌ బమ్స్‌ వస్తున్నాయి.  కాగా.. బీమ్లా నాయక్‌ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news