ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాలిబన్లు.. దౌర్జన్యాయంగా ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశంలో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ అధికారులు ఓ విషయం పై ఆందోళన చెందుతున్నారట. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ జ్వాజియన్ ప్రావిన్స్ లో తిల్యాతోపే అనే ప్రాంతం లో పెద్ధ ఎత్తున నిధులు బయటపడ్డాయి. సోవియట్ యూనియన్ ఆధీనం లో ఆఫ్ఘానిస్తాన్ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు.
ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 20600 వరకు వస్తువులు బయటపడ్డాయి. నాణేలు, ఇతర వస్తువులు వంటివి బయటపడ్డాయి. ఇవి క్రీస్తూ పుర్వం 1 వ శతాబ్దానికి చెందినవిగా అప్పటి పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందులో చాలా వరకు అప్పటి సోవియట్ యూనియన్ చేతికి చిక్కాయి.
మిగిలిన వాటిని ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం జాగ్రత్తగా భద్ర పరుస్తూ.. వస్తోంది. అయితే.. ఆ విలువైన సంపద ఎక్కడ తాలిబన్ల వశం అవుతుందోనని అధికారులు వణికిపోతున్నారు. 1994 లో ఈ సంపదను తాలిబన్ల వశం కాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే.. ఇప్పుడు తాలిబన్లు ఆ సంపదను దోచుకుంటారా ? అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఇక దీనిపై భవిష్యత్తులోనే క్లారిటీ రానుంది.