నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం హంట్. భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత వి ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
అలాగే మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, గోపరాజు రమణ, ఘట్టమనేని మంజుల, చిత్ర శుక్ల, మౌనిక రెడ్డి, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 26వ తేదీన రిలీజ్ అయి.. అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది అనే విషయం తెలిసింది. ఈ సినిమా అదే తేదీ నుంచి ఆహా వీడియోలో కూడా ప్రసారం కానుందని తాజా సమాచారం. ఇదే విష యాన్ని తెలుగు డిజిటల్ ప్లాట్ ఫారమ్ అయిన ఆహా వీడియో ధృవీకరించింది.