లాంచ్‌ అయిన Tecno Phantom X2..కాస్ట్‌ కాస్త ఎక్కువే..!!

-

టెక్నో నుంచి కొత్త ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. అదే టెక్నో ఫాంటం ఎక్స్‌ 2. సౌదీ అరేబియాలో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్‌ కానుంది. ఫోన్‌ ధర మన కరెన్సీలో అయితే..50వేలు పైనే ఉంది. ఇంకా ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టెక్నో ఫాంటం ఎక్స్2 ధర..

ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 2,699 సౌదీ అరేబియన్ రియాళ్లుగా అంటే మన కరెన్సీలో సుమారు రూ.59,200 ఉంది.
మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది.

టెక్నో ఫాంటం ఎక్స్2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.8 అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
టెక్నో ఫాంటం ఎక్స్2 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్‌గానూ ఉంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ఈ మొబైల్ స్క్రీన్‌కు ప్రొటెక్షన్ లభించనుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 9000 5జీ ప్రాసెసర్‌పై టెక్నో ఫాంటం ఎక్స్2 పని చేయనుంది.
8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో అందించారు.
మరో 5 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను స్టోరేజ్ ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
వేపర్ చాంజర్ కూలింగ్ సిస్టంతో పాటు సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఈ ఫోన్‌లో అందించారు.
ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

టెక్నో ఫాంటం ఎక్స్2 వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 2 మెగాపిక్సెల్ సెన్సార్‌లను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే వన్‌ప్లస్ 10 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌తో పోటీ పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news