బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్న ఇండియన్ క్రికెటర్..

-

బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ను తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇది పెద్దల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వచ్చే నెలలో జరగనుందని తెలుస్తోంది..

గత మూడేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న భారత క్రికెటర్ కెఎల్ రాహుల్.. బాలీవుడ్ నటి అతిశెట్టి వివాహం జనవరి 23న జరగనుంది.. అయితే వీరిద్దరి ప్రేమకు ఇరువైపు పెద్దలు అంగీకరించారని పెళ్లికి కూడా అన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.. దాదాపు ఏడేళ్ల క్రితం అతిశెట్టి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.. సూరజ్ పంచోలి లీడ్ రోల్ పోషించిన ‘హీరో’ మూవీతో తెరంగేట్రం చేసిన అతియా శెట్టి.. తన నటనతో మెప్పించింది.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా ఆమె మాత్రం.. 2019లో రిలీజ్ అయిన ‘మోతీచూర్ చక్నాచూర్’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది..

కాగా కేఎల్ రాహుల్ ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే మెగిసిన వన్డే సిరీస్లో పెద్దగా అలరించని రాహుల్ బుధవారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టు సిరీస్ లో భారత జట్టు కెప్టెన్ నడిపించబోతున్నాడు అయితే ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ గాయంతో స్వదేశానికి తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే… ఈ ఏడాది గాయాల కారణంగా కేఎల్ రాహుల్ కూడా చాలా ఇబ్బందిపడ్డాడు. ఫామ్ కోల్పోయిన కేఎల్ రాహుల్‌కి ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ 2022లో వరుసగా అవకాశాలు ఇవ్వడంపైనా విమర్శలు వచ్చాయి.

అలాగే కేఎల్ రాహుల్, అతియా శెట్టికి ఈ ఏడాది సెప్టెంబరులోనే పెళ్లి చేయాలని ఇరు వైపు కుటుంబ సభ్యులు తొలుత నిర్ణయించుకున్నా.. రాహుల్ మాత్రం ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో.. ఈ రెండు టోర్నీలు ముగిసిన తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడట. దాంతో వీరిద్దరి పెళ్లి ఇప్పుడు నిర్ణయించారు.. అలాగే సునీల్ శెట్టి ఖండాలా ఫామ్ హౌస్‌లో ఈ పెళ్లి జనవరి 23న జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news