మొదటిసారి తమ ప్రేమపై నోరు విప్పిన లావణ్య త్రిపాఠి..!

-

గత కొన్ని సంవత్సరాలుగా మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్యలు ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారు అంటే వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్న ఈ వార్తలు అప్పుడే రివీల్ చేస్తే సస్పెన్షన్ ఉంటుందని అనుకున్నారో ఏమో కానీ ఎప్పుడూ ఈ ప్రచారాన్ని ధ్రువీకరించలేదు. ఇక లావణ్య అయితే ఏకంగా మహానటి అని చెప్పాలి తమ మధ్య ఏమి లేదని అదంతా వట్టి పుకార్లేనని కేవలం తాము స్నేహితులుగానే ఉంటున్నాము అంటూ మీడియాను మభ్య పెట్టే ప్రయత్నం చేసింది కానీ అంతలోనే ఒక ఇంటర్వ్యూలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరన్న ప్రశ్నకు వరుణ్ తేజ్ అంటూ బదులిస్తూ మరొకసారి దొరికిపోయిందని చెప్పవచ్చు.

ఇకపోతే వీరు డేటింగ్ రూమర్స్ మరొకసారి తెరపైకి రావడంతో చివరికి ఆ పుకార్లనే నిజం చేస్తూ లావణ్య, వరుణ్ తేజ్ నిశ్చితార్థం చేసుకొని చూడముచ్చట జంటగా అందరి కన్నులను ఆకర్షించారు. ఇకపోతే ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇకపోతే లావణ్య మొదటిసారి తమ ప్రేమ ఎప్పుడు మొదలైంది అనే విషయాన్ని కూడా తెలిపింది. 2016 నుంచి ఈ ఇష్క్ మొదలైంది అని శాశ్వత ప్రేమను కనుగొన్నాను అంటూ లావణ్య క్యాప్షన్లో రాసుకురావడం ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది.

లావణ్య చెప్పిన మాటలు బట్టి చూస్తే వీళ్లిద్దరూ 2016 నుంచి ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో కూడా కలిసి నటించారు. ఇక పార్టీలు, లొకేషన్స్ అంటూ కలిసి వెళ్తూ ఉంటారు కానీ ప్రేమ గురించి అడిగితే మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయారు కానీ ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పేశారని చెప్పాలి. ఇక తమ ప్రేమను పంచుకుంటూ ఇద్దరు ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news