కేసీఆర్ అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేస్తాం – జీవన్ రెడ్డి

-

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేస్తామని తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నేడు జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని అన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసిఆర్ హంగులు, ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు.

కమిషన్ల కోసమే సీఎం లిఫ్ట్ ఇరిగేషన్ బాట పట్టారని అన్నారు. కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డోలతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ చూస్తున్నారు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాలేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల శాశ్వత ప్రయోజనాలను కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news