Lavanya Tripathi: అడవిలో వెన్నెల కాచినట్లు అందాల రాక్షసి అందాలు

-

బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచేసుకుంది. చక్కటి అభినయంతో కనబరిచి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆమె సుస్థిరం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ తర్వాత వచ్చిన అవకాశాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ అలా ముందుకు సాగుతోంది ఈ సొట్ట బుగ్గల చిన్నది. ఈ సుందరి సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుది.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు వృత్తిపరమైన విశేషాలను పంచుకుంటుంటుంది. ఇక తాజాగా చాక్లెట్‌ కలర్‌ డ్రెస్‌లో అదరగొట్టింది లావణ్య త్రిపాఠి. ఆభరణాలు ధరించి కొప్పులో మల్లెపూలు పెట్టుకుని అలా నిలబడి, చీరను చూపుతూ కొంటెగా చూస్తూ రకరకాల ఫోజులకు పోయింది. అలా సోకులకు పోయిన సొట్టబుగ్గల సోయగం ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సింపుల్‌ డ్రెస్‌ లో అలా ఫ్రంట్, బ్యాక్ అందాలు చూపుతూ లావణ్య సెగలు రేపుతున్నదని అంటున్నారు. ఇక ఈ భామ ఫొటోలు చూసిన నెటిజన్లు సొట్ట బుగ్గల సుందరి ఇంత అందంగా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.


స్లీవ్ లెస్ డ్రెస్ లో కంప్లీట్ ఆభరణాలు గాజులు వేసుకుంది. ఈ సుందరి ఫొటోలు చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు చివరగా కార్తీకేయ హీరోగా వచ్చిన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news