షర్మిల పార్టీపై హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

-

తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్​ షూటర్​ గా గుర్తింపు తెచ్చుకున్నారు మంత్రి హరీష్​ రావుhari. తాను పథకం రచిస్తే… ఎంత పెద్ద ప్రత్యర్థి ఉన్నా సరే చిత్తు కాక తప్పదని టీఆర్​ఎస్ వారితో పాటు వేరే పార్టీల నాయకులు కూడా భావిస్తారు. వరుసగా ఆయన సిద్దిపేట నుంచి భారీ మెజారిటీ తో గెలుస్తూ… రావడం విశేషం. ఎంతో మంది టీఆర్​ఎస్​ నాయకులు ఇప్పటికే షర్మిల రాకను, ఆమె ఇక్కడ తెలంగాణలో పార్టీ స్థాపించడాన్ని వ్యతిరేఖిస్తూ… వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ సమయంలో హరీష్​ రావు నోరు మెదపలేదు. ప్రస్తుతం ట్రబుల్​ షూటర్​ మొట్ట మొదటి సారిగా వైఎస్​. షర్మిల పార్టీపై సంగారెడ్డిలో నిర్వహించిన ఓ సభలో సంచలన కామెంట్లు చేశారు. ఇంతకీ ఆయనేమన్నారంటే….

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు

 

షర్మిల స్థాపించిన వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీపై ట్రబుల్​ షూటర్​ పరోక్షంగా విమర్శించారు. ప్రత్యేక రాష్ర్టం కొరకు పోరాడుతున్న తమని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. అలా ప్రత్యేక తెలంగాణ గురించి చులకనగా మాట్లాడిన వ్యక్తుల వారసులమని చెప్పుకుని కొంత మంది మరలా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసేందుకు వస్తున్నారని అలాంటి వారికి ఇక్కడ తెలంగాణలో చోటు లేదని అన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్​ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బతీశాడని ఆరోపించారు. అంతే కాకుండా ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలను కూడా ఎగరేసుకుపోయారని అన్నారు. ఇప్పుడు కొంతమంది ఆయన వారసులు తమను ఆశీర్వదించమని వస్తున్నారని ఎందుకు వారిని ఆశీర్వదించాలని ప్రశ్నించారు. వైఎస్​ షర్మిల గురించి, ఆమె స్థాపించిన పార్టీ గురించి హరీష్​ రావు డైరెక్టుగా విమర్శలు చేయకుండా ఇలా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్​ రెడ్డి పేర వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా ఆరోపించినా… తాను మాత్రం తెలంగాణలోనే రాజకీయాలు చేస్తానని షర్మిల చెబుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news