BREAKING : చిత్ర పరిశ్రమలో విషాదం..లతా మంగేష్కర్‌ కన్నుమూత

-

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతి చెందారు. కాసేపటి క్రితమే.. లతా మంగేష్కర్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటన చేశారు. 20 రోజుల నుంచి కరోనా మహమ్మారితో పోరాటం చేసిన లతా మంగేష్కర్‌… ఇవాళ మృతి చెందారు. ఆమె పరిస్థితి విషమించడంతో… మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె వయస్సు 92 సంవత్సరాలు.

కాగా.. గాయని లతా మంగేష్కర్‌ జనవరి 8 వ తేదీన కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్‌ రావడంతో… సరిగ్గా 20 రోజుల కిందట ఆమెను ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రిలో ఆమె కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్‌ కు.. ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక లతా మంగేష్కర్‌ మృతి పట్ల… సిని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news