ప్రముఖ ల్యాప్‌టాప్ ల తయారీ సంస్థ లెనోవో ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ఫీచర్లు కలిగిన ల్యాప్ టాప్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది.వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. తాజాగా మరో మూడు ల్యాప్‌టాప్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది.కొత్త థింక్ సెంటర్ నియో డెస్క్‌టాప్ కంప్యూటర్ల పోర్ట్‌ఫోలియోను అనౌన్స్ చేసింది..ఇవి లెనోవో థింక్‌సెంటర్ డెస్క్‌టాప్ PCలలో మూడవ తరం డివైజ్‌లు. మోడ్రన్ ఇండియన్ ఆఫీస్ అవసరాల కోసం వీటిని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. లెనోవో థింక్‌సెంటర్ నియో 50s ఒక చిన్న ఫారమ్ ఫ్యాక్టర్‌తో వస్తుంది. థింక్‌సెంటర్ నియో 50t అనేది ఒక టవర్ డెస్క్‌టాప్. ఈ రెండూ 64GB RAM, 12వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ వంటి ఫ్లాగ్‌షిప్-లెవల్ స్పెసిఫికేషన్‌లతో రిలీజ్ అవుతున్నాయి. థింక్‌సెంటర్ నియో 30a 24 అనేది ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్. ఇది కూడా 12వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో పని చేయనుంది.
థింక్‌సెంటర్ నియో 50s ఫీచర్స్..
థింక్‌సెంటర్ నియో 50s మోడల్ గరిష్టంగా 64GB వరకు DDR4 RAM, 1TB PCIe SSD స్టోరేజ్ ఉండే 12వ తరం ఇంటెల్ కోర్ i9 CPUతో రానుంది.
50s మోడల్ గరిష్టంగా 64GB వరకు DDR4 RAM:
12వ తరం ఇంటెల్ కోర్ i9 CPUతో వస్తుంది. ఈ డెస్క్‌టాప్ ఇన్‌టెల్ ఐరిస్ XE DG1 గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో రానుంది. థింక్‌సెంటర్ నియో 50t వేరే ఫారమ్ ఫ్యాక్టర్‌లో, ఇలాంటి స్పెసిఫికేషన్‌లతోనే వస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i9 (12 జనరేషన్) CPUతో వస్తుంది. 64GB RAM, 1TB HDD స్టోరేజ్, ఇంటెల్ UDH గ్రాఫిక్స్ ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్లలో లాంచ్ అయింది.
థింక్‌సెంటర్ నియో 30a 24 డెస్క్‌టాప్ FHD.. రిజల్యూషన్‌తో, 23.8 అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 12వ తరం ఇంటెల్ కోర్ i7 చిప్‌సెట్‌తో గరిష్టంగా 16GB వరకు RAM, 1TB వరకు SSD స్టోరేజ్‌తో రానుంది. ఈ మూడు డెస్క్‌టాప్‌లను లోకల్ సేల్స్ టీమ్ ద్వారా కొకుగొల్లు చెయాల్సి ఉంటుందని కంపెనీ అధికారులు చెబుతున్నారు.
ఈ కంప్యూటర్ల లాంచింగ్ సందర్భంగా లెనోవో ఇండియా కమర్షియల్ కేటగిరీ అండ్ స్ట్రాటజీ డైరెక్టర్ ఆశిష్ సిక్కా ఒక ప్రకటన విడుదల చేశారు. లెనోలో కంపెనీలకు పర్యావరణ స్పృహతో కూడిన డిజైన్, తక్కువ ఖర్చుతో డెస్క్‌టాప్‌లు లభిస్తాయి. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే సరికొత్త వినూత్న డివైజ్‌లను అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇవి ఫ్యూచరిస్టిక్ వర్క్‌ప్లేస్ కొలాబరేషన్ ఫీచర్లతో వచ్చే కాంపాక్ట్, హై పెర్ఫార్మెన్స్ మెషీన్‌లు. మల్టీ-టాస్కర్లు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, ఎకోప్రెన్యూర్‌లను ఇవి ఆకట్టుకుంటాయి.’ అని లెనోవో అధికారి పేర్కొన్నారు..