Breaking : ఊర పందిని తిని చిరుతపులి మృతి

-

 

నల్గొండ జిల్లా చందనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డు సమీపంలో చిరుతపులి మృతి కలకలం రేపింది. డంపింగ్ యార్డ్ పక్కన ఓ చిరుత కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంలో అటవీ, పోలీసు శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత కళేబరాన్ని పరిశీలించి వారం పదిరోజుల క్రితం మరణించినట్లుగా భావిస్తున్నారు.

గత కొన్ని నెలలుగా కేశరాజుపల్లి, శేషమ్మగూడెం, ఎస్టీ కాలనీ, చందనపల్లి గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు సైతం చిరుత సంచారాన్ని గుర్తించారు. అయితే ఈ చిరుతపులి కూడా అలా సంచరిస్తూనే.. కనిపించిన ఊరపందిని తినుండొచ్చని.. అందువల్లే మృతి చెందిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఊర పందులను పట్టుకోవడానికి మందులు పెట్టామని.. దానివల్లే చిరుత మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news