లండన్ లోని థేమ్స్ నదిలాగా మూసీని మారుస్తాం : రేవంత్ రెడ్డి

-

ఎంఐఎం పార్టీ సలహాలు, సూచనలతో పాత బస్తీని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఓల్డ్ సిటీని అన్ని విధాలా డెవలప్ చేస్తాం అని తెలిపారు. మూసీ నది అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. లండన్లోని థేమ్స్ నదిలాగా మూసీని మారుస్తాం అని అన్నారు. ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ హైదరాబాద్ సిటీగా మారుస్తాం హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తా.. ఆ తర్వాత అభివృద్ధి గురించే ఆలోచిస్తా’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే…పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద సీఎం పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఈ లైన్ను నిర్మించనున్నారు. మరో విడతలో అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నిర్మిస్తారు. అలాగే మైనారిటీ గురుకుల స్కూల్, కాలేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news