జగన్‌ కు షాక్‌ ఇచ్చిన రఘురామ.. ఏపీ లిక్కర్‌ పై కేంద్రానికి లేఖ

-

ఢిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ కి వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్‌ లో నాణ్యత లేని మద్యం విక్రయాల పై కేంద్ర మంత్రికి రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్‌ లో నాణ్యత లేని మద్యంతో భవన కార్మికులు, ఇతర పనులు చేసుకునే వారి పై తీవ్ర ప్రభావం పడుతుందని లేఖలో పేర్కొన్నారు.

నాణ్యత లేని మద్యం పైన కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల తో కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో వివరించారు వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు. నాణ్యతలేని మద్యం నమూనాలను సేకరించి దాన్ని తాగితే ఆరోగ్యాల పై కలిగే అనారోగ్యాల పై అధ్యయనం చేయించాలని లేఖ రాశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ త్వరగా స్పందించి… దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహరంపై కాలయాపన చేస్తే… ప్రజల ప్రాణాలకు హానీ కలిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news