ఏపీలో షాకింగ్ సర్వే: వైసీపీ-టీడీపీలకు ఎన్ని సీట్లు వస్తాయంటే?

-

2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 సీట్లు సాధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. మరి ఈ రెండేళ్లలో వైసీపీ ఇంకా బలపడిందా? లేక టీడీపీ పుంజుకుండా అనే అంశాలపై ఓ ఆత్మసాక్షి గ్రూప్ అనే ఓ ప్రైవేట్ సర్వే సంస్థ…ఏపీలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేసిందని తెలిసింది.

ysrcpandtdp
ysrcpandtdp

ఇప్పుడు ఈ సర్వే సోషల్ మీడియా, యూట్యూబ్‌లో బాగా వైరల్ అవుతుంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆ సర్వే రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాకపోతే ఇక్కడ షాకింగ్ కలిగించే అంశం ఏంటంటే…గత ఎన్నికల కంటే ఇప్పుడు వైసీపీకి ఇంకా బలం తగ్గుతుందని ఆ సర్వే చెప్పింది. అయితే ఆ సర్వే సంస్థ రెండు విడతలగా సర్వే చేసిందట. ఈ ఏడాది మే నెలలో ఒకసారి, జూన్ నెలలో ఒకసారి సర్వే చేసినట్లు చెబుతోంది.

ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఓడిపోవడం ఖాయమని చెప్పింది. అటు టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఓడిపోవడం గ్యారెంటీ అని ఆ సర్వే వివరాలు చెబుతున్నాయి. అలాగే 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పోటాపోటిని ఎదురుకుంటారని చెప్పింది. అటు 9 మంది మంత్రులు కూడా ఓడిపోయే పరిస్తితి ఉందని చెప్పింది.

మొత్తానికి చూసుకుంటే ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీకి 115 నుంచి 121, టీడీపీకి 50-55 సీట్లు రావొచ్చని ఆ సర్వే చెబుతోంది. అయితే ఇప్పటికిప్పుడు జనసేన-బీజేపీల ప్రభావం పెద్దగా లేదని ఆ సర్వే అంటుంది. మరి చూడాలి ఈ సర్వేలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో?

Read more RELATED
Recommended to you

Latest news