ఎల్ఐసీ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వివిధ రకాల ప్లాన్స్ ని కూడా తీసుకు వచ్చింది ఎల్ఐసీ. అయితే ఎల్ఐసీ అందిస్తున్న వాటిలో టెక్ టర్మ్ ప్లాన్ నంబర్ 854 LICలో ఉత్తమమైనది. చౌకైన పాలసీ గా దీన్ని చెప్పవచ్చు.
18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వున్నవాళ్లు దీన్ని తీసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. రూ .50 లక్షల బీమా పాలసీ తీసుకోవాలి. ఒక వ్యక్తికి 80 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే పని చేస్తుంది. మీరు దీన్ని కనీసం పదేళ్లు తీసుకోవాల్సి వుంది. మాక్సిమం 40 సంవత్సరాలు తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి కనుక మరణిస్తే రూ. 50 లక్షలు వారి కుటుంబానికి వస్తాయి.
ఈ డబ్బులు ఒకేసారి చెల్లిస్తారు. 30 ఏళ్లు, కవరేజీని ఎంచుకుంటే రూ. 30 సంవత్సరాల పాలసీ కాలానికి 50 లక్షలు, మీ ప్రీమియం దాదాపు రూ. సంవత్సరానికి రూ. 4,000. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా దీనితో మీరు పొందవచ్చు. ఒకవేళ కనుక పాలసీదారు క్యాన్సర్ లేదా గుండె సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయినట్లయితే ఇంకో ప్లస్ వుంది. ఇక దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నది చూస్తే.. మీ సమీపంలోని LIC బ్రాంచ్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మీరు కస్టమర్ కేర్ సెంటర్‌ను కాంటాక్ట్ చెయ్యచ్చు.