దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఊహించని షాక్ తగిలింది. దుబాక బీజేపీ పార్టీలో ముసలం నెలకొంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు సీనియర్లు. ఇందులో భాగంగానే, రహస్య ప్రాంతంలో సమావేశమయ్యారు దుబ్బాక నియోజక వర్గ బీజేపీ సీనియర్ నాయకులు.
తమకు పార్టీలో తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని..తగిన గౌరవం సీనియర్ నేతలకు కల్పించాలని సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా, ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ కోవర్టుగా పనిచేస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ కోసం రహస్య సమావేశమై ప్రణాళికలు రూపొందించినట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. దీనిపై రఘునందన్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.