మహిళలను ధనవంతులను చేసే ఈ LIC Scheme గురించి మీకు తెలుసా?

-

అతిపెద్ద బీమా సంస్థగా మనదేశంలో ఎల్‌ఐసీ ఉంది. ప్రజలే కేంద్రంగ భారతీయ జీవిత బీమా సంస్థ వివిధ పథకాలకు రూపకల్పన చేస్తుంది. ఈ క్రమంలోనే రకరకాల వినూత్న పథకాలను LIC Scheme లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొస్తుంది. దీర్ఘకాలతంతో పాటు తక్కువ కాలం కొనసాగే పాలసీలను రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తమ సౌలభ్యాన్ని బట్టి వివిధ పథకాలను ఎంచుకుంటారు. తాజాగా మహిళలే కేంద్రంగా ఎల్ఐసీ వినూత్న పథకం తీసుకొచ్చింది. ఎఐసీ తీసుకొచ్చిన ఈ పథకం పేరు LIC Aadhaar Shila Plan ‘ఆధార్ శిలా ప్లాన్’. ఈ పథకానికి ఆధార్ కార్డు ఉన్న 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మహిళలు అర్హులు.

LIC Aadhaar Shila Plan for Females
LIC Aadhaar Shila Plan for Females

ఈ మహిళలు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం ద్వారా పాలసీదారులకు భద్రత, పొదుపు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగస్వామ్యం ద్వారా పాలసీదారులకు బీమా కూడా వర్తిస్తుంది. అయితే, మెచురిటీ తర్వాత పలు బెన్‌ఫిట్స్ ఉంటాయి. ఈ ప్లాన్ ద్వారా కనీస మొత్తం బీమా మొత్తం రూ .75,000 కాగా, గరిష్టంగా రూ. 3 లక్షలు ఉంటుంది. పాలసీ వ్యవధి కనిష్టం పదేళ్లు కాగా గరిష్టం ఇరవై ఏళ్లు.

ఇక ఈ ప్లాన్‌లో మెచురిటీ ఏజ్ 70 ఏళ్లు. ఈ ప్లాన్ కోసం ప్రీమియమ్స్‌ను మహిళలు నెలవారీగా త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షికంగా చెల్లించొచ్చు. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్లాన్ కింద, ప్రీమియం, మెచురిటీ క్లెయిమ్, డెత్ క్లెయిమ్‌పై పన్ను మినహాయింపు సౌకర్యం లభిస్తుంది. LIC Aadhaar Shila Plan ఈ పాలసీ తీసుకున్నాక ఐదేళ్ల తర్వాత LIC పాలసీదారు మరణిస్తే మెచురిటీపై విధేయత జోడింపు ఫెసిలిటీ కూడా అవెయిలబుల్‌లో ఉంటుంది. పాలసీ టైం పీరియడ్ పూర్తయ్యే వరకు పాలసీదారు బతికి ఉంటే మెచురిటీ బెన్‌ఫిట్స్ ఉంటాయి. అనగా బేసిక్ సమ్ అస్యూర్డ్ ప్లస్ లాయల్టీ అడిషన్స్ ఉంటాయి. పాలసీ ప్రీమియమ్స్ చెల్లించినట్లయితేనే మెచురిటీ మొత్తం పొందడానికి అర్హులు అని భావించాలి.

Read more RELATED
Recommended to you

Latest news