నెల నెలా పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి..!

-

భవిష్యత్తు బాగుండాలంటే కచ్చితంగా డబ్బులని సేవ్ చేస్తూ ఉండాలి. అందుకనే చాలా మంది వారి సంపాదన లో కొంత డబ్బులను ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా ఎందులో అయినా ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇది చూడాలి. LIC ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వీటిలో డబ్బులని పెడితే మంచిగా లాభాలు వస్తాయి. అయితే పెన్షన్ ప్లాన్ కింద మీరు అకౌంట్ ని ఓపెన్ చేస్తే మీరు జీవితాంతం పెన్షన్ ని పొందేందుకు అవుతుంది. ఒకవేళ కనుక పాలసీదారు మరణిస్తే.. ఆ డబ్బులు నామినీకి వస్తాయి.

సరళ్‌ పెన్షన్‌ యోజన స్కీమ్ వివరాలు:

ఈ స్కీమ్ లో మీరు ప్రీమియం ని కేవలం ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
దానితో జీవితాంతం పెన్షన్ పొందవచ్చు.
పాలసీ ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే పెన్షన్ మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు.

అర్హత వివరాలు:

ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టాలంటే 40 నుండి 80 సంవత్సరాల వయస్సు ఉండాలి.
కావాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి దీనిలో డబ్బులని పెట్టవచ్చు.
6 నెలల తర్వాత కూడా అకౌంట్ ని సరెండర్ చేయవచ్చు.
కనీసం 1000 రూపాయల పెన్షన్ స్టార్ట్ అవుతుంది.
దీనిలో ఎంతైనా పెట్టచ్చు. పరిమితి లేదు.
నెలవారీ, త్రైమాసికం, ఆర్థ సంవత్సరం, వార్షిక పెన్షన్‌ కింద పెన్షన్ ని పొందొచ్చు.

ఎంత పెన్షన్ ని పొందొచ్చు..?

ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే నెలవారీ పెన్షన్‌ రూ.1000 వస్తాయి. త్రైమాసిక పెన్షన్‌ రూ.3,000. ఇదిలా ఉంటే అర్ద సంవత్సరం పెన్షన్ రూ.6000 గా వుంది. అదే వార్షిక పెన్షన్‌ అయితే రూ.12,000.

Read more RELATED
Recommended to you

Latest news