లిక్కర్ లోడ్‌ మినీ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డం జనం

-

మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది..ఈ ఘటనలో కొన్ని బాటిళ్లు ధ్వంసం కాగా మరికొన్ని కిందపడ్డాయి.. ఇంకేముంది రోడ్డుపై అలా బాటిల్స్ కనపడగానే జనాలు ఇలా వచ్చేశారు. కిందపడ్డ మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. అబ్బా ఛాన్స్ దొరికిందిలే అనుకుంటూ బాటిళ్లను దొరికినవాళ్లకు దొరికినట్లు ఎత్తుకెళ్లారు. అసలు ఆ వ్యాన్‌లో ఎవరైనా ఉన్నారా..? వారికి ఏమైనా దెబ్బలు తగిలాయా..? ఇలా ఏం చూడలేదు. అందినకాడికి మందు సీసాలు ఎత్తుకెళ్ళిపోయారు.

Lorry carrying liquor meets with accident in Kozhikode, locals grab bottles  - KERALA - GENERAL | Kerala Kaumudi Online

కొందరు అయితే బస్తాలతో వచ్చేశారు.మద్యం సీసాలతో వెళ్తున్న వాహనం టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న లిక్కర్ బాటిల్స్ నేల పాలయ్యాయి. సమాచారం కొన్ని నిమిషాల్లోనే ఆ ఏరియా స్ప్రెడ్ కావడంతో మద్యం ప్రియులు హుటాహుటీన అక్కడికి చేరుకుని అందిన కాడికి మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. రోడ్డుపై కొన్ని పగిలిపోగా, మిగిలిన వాటికోసం చాలామంది పోటీపడ్డారు.చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అందులో ఉన్న మద్యం బాటిళ్ల కేసులు నేల పాలయ్యాయి.

 

అటువైపు వెళ్తున్న జనం కూడ ఆ బాటిల్స్ కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. వాటిని తీసుకెళ్లవద్దని పట్టుకెళ్లొద్దని డ్రైవర్ ఎంత బ్రతిమిలాడిన జనాలు పట్టించుకోలేదు. అతని మాట వినకుండా అందిన కాడికి పట్టుకొని ఉడాయించారు. సుమారు ఆరు లక్షల విలువైన మద్యం సీసాలను జనాలు ఎత్తుకెళ్లారని వాహనం డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. అబ్బా ఛాన్స్ దొరికిందిలే అనుకుంటూ బాటిళ్లను దొరికినవాళ్లకు దొరికినట్లు ఎత్తుకెళ్లారు. ఇంకే వేరేది ఏమైనా ఆగేవారు ఏమో కానీ.. అక్కడుంది నోరూరించే లిక్కర్. ఇక మందుబాబులను ఆపడం ఎవరితరం అవుతుంది చెప్పండి.

Read more RELATED
Recommended to you

Latest news