తెలంగాణ వ్యాప్తంగా బీర్లకు పెరిగిన డిమాండ్… గతేడాది కన్నా పెరిగిన అమ్మకాలు

-

తెలంగాణలో మద్యం ఆదాయం ఎక్కువ అని అందరికీ తెలిసిన విషయమే. పెళ్లి అయినా… చావు అయినా మందు లేనిదే కుదరదు. దీంతో మందు విక్రయాలు ఏటికేడు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు బ్రాందీ, విస్కీకి ఎక్కువగా గిరాకీ ఉండేది. అయితే ప్రస్తుతం బీర్ల అమ్మకాలు పెరిగాయి. వేసవి తీవ్రత పెరగడం, ఎండలు దంచికొడుతుండటంతో చల్లని బీర్లు తాగేస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. గత 10 రోజుల అమ్మకాలను గతేడాది అమ్మకాలతో పోలిస్తే దాదాపుగా 20 శాతం పెరిగాయి. ఎప్రిల్ 1 నుంచి 10 వరకు 10 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. 2021లో ఇదే సమయంలో 8.3 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. బీర్ల అమ్మకాలు పెరగడంతో ఇతర మద్యం అమ్మకాల్లో స్వల్పంగా తగ్గుదల నమోదైంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల జోలికిపోలేదు మందుబాబులు. ఎక్కువ విస్కీ, బ్రాందీలనే కొనుగోలు చేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో బీర్ల అమ్మకాలు దాదాపుగా పడిపోయాయి. అయితే ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో చల్లని బీర్ల అమ్మకాలు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news