పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట

-

మహారాష్ట్రలో నమోదైన ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట లభించింది. పరువునష్టం కేసులో కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి ఆయనకు శాశ్వతం మినహాయింపు లభించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మహాత్మా గాంధీ హత్యకు, ఆర్ఎస్ఎస్ కి ముడిపెడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని.. ఆ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ పరువు తీసేలా ఉన్నాయంటూ ఒక సంఘ్ కార్యకర్త 2014లో ముంబైలోని భీమండి మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

ఈ కేసు విచారణకు గాను 2018 జూన్ లో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. అయితే తాను ఢిల్లీ వాసినని, పార్టీ కార్యక్రమాలకు తోడు ఎంపీగా తన నియోజకవర్గంలో పర్యటనలు చేయాల్సి ఉంటుందని చెబుతూ.. కోర్టులో హాజరు నుంచి రాహుల్ గతేడాది మినహాయింపు కోరారు. బదులుగా తన న్యాయవాదిని అనుమతించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తాము తదుపరి ఆదేశాలను జారీ చేసేంతవరకు రాహుల్ కు కోర్టు విచారణ నుంచి మినహాయింపును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news