ఐపీఎల్ 2023: పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చిన… ఇంగ్లాండ్ హార్డ్ హిట్టర్ !

-

ఐపీఎల్ మొదలై ఇప్పటికి 15 సీజన్ లు గడుస్తున్నా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ప్రతిసారీ పేపర్ మీద టీం బాగుంది అని చంకలు గుద్దుకోవడం… తీరా ఫీల్డ్ లోకి దిగాక షాకుల మీద షోకులు ఇస్తూ లీగ్ దశలోనే ఎలిమినేట్ కావడం జరుగుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం మంచి ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసుకుని టైటిల్ సాధితమన్న భరోసాతో పంజాబ్ కింగ్స్ టీం ఉంది. మరొక్క రోజులో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పంజాబ్ కు గట్టి షాక్ తగిలింది.

పంజాబ్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్ ను ఏప్రిల్ 1వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. కానీ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ హార్డ్ హిట్టర్ అయిన లియామ్ లివింగ్ స్టన్ మాత్రం మిస్ కానున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇటీవల మోకాలికి చికిత్స చేయించుకోవడంతో కొంతకాలం ఆటకు దూరంగా ఉన్నాడు. లివింగ్ స్టోన్ ఫిట్నెస్ ను దృష్టిలో ఉంచుకున్న ఇంగ్లాండ్ మానేజిమెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదట. అందువలన మొదటి మ్యాచ్ కు హార్డ్ హిట్టర్ మరియు ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను మార్చేయగల లివింగ్ స్టోన్ డైరెక్ట్ గా రెండవ మ్యాచ్ కు రాజస్థాన్ రాయల్స్ తో బరిలోకి దిగనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news